ఎమ్మెల్యేల తరలింపునకు నాలుగు ప్రత్యేక బస్సులు

ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Update: 2023-12-07 05:59 GMT

దిశ, శేరిలింగంపల్లి : ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి యెల్లా హోటల్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన 64 మంది ఎమ్మెల్యేలు ఇక్కడి నుండి నేరుగా గాంధీ భవన్‌కు వెళ్లనున్నారు. అటు నుండి ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం జరగనున్న రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యేలు అంతా హాజరుకానున్నారు. ఎమ్మెల్యేల కోసం ప్రత్యేకంగా 4 బస్సులను ఏర్పాటు చేసి అందులోనే ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు. ఎమ్మెల్యేలు ప్రయాణించే వాహనాలకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దారి పొడుగునా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బారులు తీరారు.


Similar News