Vinod Kumar: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర రంగరాజన్‌పై కొంత మంది అతివాద వ్యక్తులు దాడి చేయడం అత్యంత దుర్మార్గమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు.

Update: 2025-02-10 17:00 GMT
Vinod Kumar: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర రంగరాజన్‌పై కొంత మంది అతివాద వ్యక్తులు దాడి చేయడం అత్యంత దుర్మార్గమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, రోజురోజుకూ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులపై దాడి ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించకూడదని పేర్కొన్నారు. దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ కుటుంబ పరిస్థితి ఇంతటి ఘోరంగా ఉందంటే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. దాడి చేసిన వారిని చట్టపరంగా, కఠినంగా శిక్షించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News