Gummadi Narsaiah: సీఎం రేవంత్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య భేటీ అయ్యారు.

Update: 2025-03-18 09:49 GMT
Gummadi Narsaiah: సీఎం రేవంత్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య భేటీ
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య (Gummadi Narsaiah) సీఎంను కలిశారు. ఇవాళ అసెంబ్లీలోని సీఎం చాంబర్ లో రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలకు సంబంధించి సీఎంకు వివరించారు. వాటిని పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసం వద్ద కలిసేందుకు గుమ్మడి నర్సయ్య ప్రయత్నించగా అపాయింట్ మెంట్ లేదని భద్రతా సిబ్బంది ఆయనను లోనికి పంపించకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశంపై ఇటీవలే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. గుమ్మడి నర్సయ్య వచ్చిన విషయం తనకు ఆ సమయంలో తెలియదన్నారుత తెలిసిన వెంటనే తన కార్యాలయ సిబ్బందితో నర్సయ్యకు ఫోన్ చేసి మాట్లాడినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎంతో గుమ్మడి నర్సయ్య భేటీ అయ్యారు. 

Tags:    

Similar News