సీఎం ఎవరో ఇప్పుడే చెప్పను.. మాజీ మంత్రి రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు

అసెంబ్లీ ఎన్నికల వేళ టీ కాంగ్రెస్‌లో సీఎం పోస్ట్‌పై జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే తానే సీఎం అంటూ పలువురు సీనియర్లు బాహాటంగానే

Update: 2023-11-20 07:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల వేళ టీ కాంగ్రెస్‌లో సీఎం పోస్ట్‌పై జోరుగా చర్చ జరుగుతోంది. టీ- కాంగ్రెస్‌లో దాదాపు ఆరడజను మంది సీనియర్ నేతలు సీఎం పోస్ట్‌పై ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే తానే సీఎం అంటూ ఇప్పటికే పలువురు సీనియర్లు బాహాటంగానే చెబుతున్నారు. దీంతో పోలింగ్ ముగియక ముందే సీఎం పోస్ట్ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పదవిపై మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆమె ఖమ్మంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం పదవిని ఆశించి వచ్చని.. దాంట్లో తప్పేమి లేదన్నారు. కానీ సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని.. హై కమాండ్ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.

సీఎం ఎవరనేది ఎమ్మెల్యేలు, హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, దానిపై ఇప్పుడే తాను జోస్యం చెప్పలేనన్నారు. కర్నాటకలో డీకే శివకుమారే సీఎం అని అంతా అనుకున్నారు, కానీ ఇమేజ్ ఉన్న సిద్ధరామయ్యకు అధిష్టానం ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ విజయంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించినప్పటికీ.. సీఎం పదవిని త్యాగం చేశారని గుర్తు చేశారు. డీకే శివకుమార్‌లా త్యాగం చేసే గుణం ఉండాలని రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రావడం ఖాయమని ఆమె దీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

Tags:    

Similar News