‘సీఎం రేవంత్ రెడ్డి చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాడు’

కేంద్ర జలవనరుల శాఖపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే సమర సింహారెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

Update: 2024-03-18 07:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర జలవనరుల శాఖపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే సమర సింహారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణానది నుండి తెలంగాణ దక్కాల్సిన వాట దక్కడం లేదని అన్నారు. 800 టీఎంసీలలో మనకు 64 శాతం వాటా రావాల్సి వుండే.. తెలంగాణ వాళ్ళు ఎక్కువనీళ్లు వాడుకుంటున్నారని కేంద్ర జలవనరుల శాఖ చెప్పడం బాధాకరమని అన్నారు 100 రోజుల్లో చెయ్యాల్సిన దానికంటే ఎక్కువనే సీఎం రేవంత్ రెడ్డి చేశాడని తెలిపారు. చెప్పిన గ్యారంటీలన్నీ చేస్తున్నాడు. కృష్ణా వాటర్ ఇష్యూ కూడా తేల్చాలని కోరారు. 1990లో నేను రెవెన్యూ మినిస్టర్‌గా 29 మందిని సస్పెండ్ చెయ్యాల్సి వచ్చిందని గుర్తుచేశారు. కృష్ణా రివర్ పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని త్వరగా పూర్తిచేయాలని కోరుతున్నామని అన్నారు.

Tags:    

Similar News