లోక్‌సభ ఎన్నికల్లో దళితుల సత్తా చూపిస్తాం: చంద్రశేఖర్
బీజేపీకి తోక బీఆర్ఎస్ అని మాజీ మంత్రి చంద్రశేఖర్ విమర్శించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను భూస్థాపితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీకి తోక బీఆర్ఎస్ అని మాజీ మంత్రి చంద్రశేఖర్ విమర్శించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను భూస్థాపితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభలో దళితుల సత్తా చూపించాలన్నారు. వర్గీకరణపై బీజేపీ మోసం చేసిందన్నారు. బీజేపీ సూచనతోనే గతంలో కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని కోరాడన్నారు. వర్గీకరణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని, కేంద్రంలో పవర్‌లోకి రాగానే పూర్తి చేస్తామన్నారు. రిజర్వేషన్లు తొలగించేందుకే బీజేపీ 400 సీట్లు అని ప్రకటిస్తున్నదని, సామాన్య ప్రజలంతా ఆలోచించాలన్నారు. థర్డ్ టైమ్ బీజేపీ పవర్‌లోకి వస్తే, ఎస్సీ, ఎస్టీ, బీసీల బతుకులు ఆగమవుతాయన్నారు. గతంలో 20 లక్షల మంది దళితులు వర్గీకరణ చేయాలని వెంకయ్య నాయుడుకు ప్రాధేయపడ్డారని, కానీ బీజేపీ అడ్డుకున్నదని ఆరోపించారు. ఇప్పుడు నేరుగానే రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కుట్రలు చేస్తుందన్నారు. కొందరు దళిత నాయకులు స్వర్ధ పూరిత రాజకీయాల కోసం బీజేపికి మద్ధతు పలికారని, ఆ ట్రాప్‌లో పడొద్దని చంద్రశేఖర్ సూచించారు.