నేరాలు ప్రూవ్ చేయాలంటే ఫోరెన్సిక్​ ఆధారాలే కీలకం: డీజీ షిఖా గోయెల్​

నేరాలకు పాల్పడే నిందితులకు శిక్షలు పడటంలో ఆధారాలు కీలకపాత్ర వహిస్తాయని షీ టీమ్స్, భరోసా అదనపు డీజీపీ షిఖా గోయెల్​అన్నారు.

Update: 2023-05-08 16:43 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: నేరాలకు పాల్పడే నిందితులకు శిక్షలు పడటంలో ఆధారాలు కీలకపాత్ర వహిస్తాయని షీ టీమ్స్, భరోసా అదనపు డీజీపీ షిఖా గోయెల్ ​అన్నారు. మెడికో లీగల్​కేసుల్లో సమగ్రమైన ఫోరెన్సిక్​ఆధారాలను సేకరించి న్యాయస్థానాలకు అందచేస్తే నిందితులు తప్పించుకోవటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు. రాష్ర్ట వ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎనభై అయిదు మంది వైద్యులకు ఉమెన్​సేఫ్టీ వింగ్​కార్యాలయంలో ఫోరెన్సిక్​ఆధారాలు సేకరించే అంశంపై నిర్వహించిన రెండు రోజుల వర్క్​షాప్​ముగిసిన నేపథ్యంలో అదనపు డీజీపీ షిఖా గోయెల్​మాట్లాడారు.

ఆధారాలను సేకరించటమే కాదు వాటిని భద్రపరచటంలో కూడా అత్యంత కీలకమని చెప్పారు. ముఖ్యంగా అత్యాచారాలు, మైనర్లపై జరిగే లైంగిక వేధింపుల కేసుల్లో ఈ ఆధారాలు నిందితులకు శిక్షలు పడేలా చూడటంలో ప్రధానపాత్ర పోషిస్తాయన్నారు. శిక్షలు పడినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెట్లబుర్జూ ఆస్పత్రి సూపరిండింటెంట్​డాక్టర్​మాలతీ పొన్నూర్‌తో పాటు ఉమెన్​సేఫ్టీ వింగ్​అదనపు సూపరిండింటెంట్​డాక్టర్​పీ.అశోక్, ఫోరెన్సిక్​ఎక్స్‌పర్ట్​డాక్టర్​సుధ, భరోసా టెక్నికల్​డైరెక్టర్​మమతా రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News