HYD: గందరగోళంగా హైదరాబాద్ హోటళ్ల పరిస్థితి.. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో షాకింగ్ విషయాలు
హైదరాబాద్‌లోని హోటళ్లలో ఫుడ్ సెఫ్టీ అధికారుల(Food Safety Officers) దాడులు నిర్వహించారు. ఆదివారం దిల్‌సుఖ్‌నగర్(Dilsukhnagar)లోని బాలాజీ దాబా, సంతోష్ దాబా, సహదేవరెడ్డి స్వీట్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని హోటళ్లలో ఫుడ్ సెఫ్టీ అధికారుల(Food Safety Officers) దాడులు నిర్వహించారు. ఆదివారం దిల్‌సుఖ్‌నగర్(Dilsukhnagar)లోని బాలాజీ దాబా, సంతోష్ దాబా, సహదేవరెడ్డి స్వీట్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఫ్రిడ్జ్‌లో కూరగాయలు, బటర్, ఆహార పదార్థాలు నిల్వచేసి వాడుతున్నారని వెల్లడించారు. అంతేకాదు.. స్వీట్లు, ఫుడ్ మొత్తం నాణ్యత లేని వంట నూనెతో వాడుతున్నట్లు పేర్కొన్నారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని హోటల్ యాజమాన్యంపై మండిపడ్డారు. హోటల్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుడ్ సెఫ్టీ లేకుండా ఇలాంటి ఆహారం ప్రజలకు పెడుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి ఆహారం తినే భోజన ప్రియులు అనారోగ్యానికి గురి అవుతున్నారని తెలిపారు. పలు హోటళ్లపై చర్యలు తీసుకుంటున్నా కొందరు హాటల్ యాజమాన్యం తీరు మాత్రం మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.