Minister Seethakka : ఫుడ్ పాయిజన్ ఘటనలపై విచారణ జరపాలి : మంత్రి సీతక్క
గురుకులాల్లో మెస్ చార్జీలు పెంచిన తర్వాతే కొన్నిచోట్ల ఫుడ్ పాయిజన్ ఘటన(Food poisoning incidents)లు జరగడం వెనుక కుట్ర ఉందని, ఆయా సంఘటనలపై సమగ్ర విచారణ(investigate) జరపాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నామని మంత్రి సీతక్క(Minister Seethakka)తెలిపారు.
దిశ, వెబ్ డెస్క్ : గురుకులాల్లో మెస్ చార్జీలు పెంచిన తర్వాతే కొన్నిచోట్ల ఫుడ్ పాయిజన్ ఘటన(Food poisoning incidents)లు జరగడం వెనుక కుట్ర ఉందని, ఆయా సంఘటనలపై సమగ్ర విచారణ(investigate) జరపాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నామని మంత్రి సీతక్క(Minister Seethakka)తెలిపారు. మహబూబాబాదు కొత్తగూడ మండలంలో మంత్రి సీతక్క మాట్లాడారు. ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్రలు ఉన్నట్లుగా అనుమానముందని అందుకే విచారణ జరిపించాల్సిన అవసరముందన్నారు. దీనిమీద సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న ఓ గురుకులంలో కిచెన్ వెనుక గదిలో ఉన్న ఎలుకల ఫోటోను తీసి అన్నంలో పడ్డట్లుగా ప్రచారం చేశారని తెలిపారు.
ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయం కోసం విద్యార్థుల్ని బలిచేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులకు గురుకుల హాస్టల్లో కొంతమంది ఉద్యోగులకు మధ్య సంబంధాలు ఉన్నాయన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలని సీఎంను కోరుతున్నామని స్పష్టం చేశారు.