ఎట్టకేలకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్

తెలుగు రాష్ట్రాలను తొలకరి చినుకులు పలకరించాయి.

Update: 2023-06-24 01:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాలను తొలకరి చినుకులు పలకరించాయి. నైరుతి రుతి పవనాలు క్రమంగా రెండు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు నిజామాబాద్ విస్తరించాయని క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని పేర్కొంది. ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం, యాదాద్రి- భువనగిరి, ములుగు జిల్లాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావారణ శాఖ తెలిపింది.

రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణలో ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వరణుడి రాకతో రైతన్నలు సాగుకు రెడీ అవుతున్నారు. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 

Tags:    

Similar News