ఉపాధి హామీ కూలీలను అడ్డుకుంటున్న రైతులు.. తీవ్ర ఆందోళన

ఉపాధి హామీ కూలీలను రైతులు అడ్డుకోవడం కలకలరం రేపింది.

Update: 2024-05-17 07:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉపాధి హామీ కూలీలను రైతులు అడ్డుకోవడం కలకలరం రేపింది. దీంతో ఉపాధి కూలీలు జగిత్యాల జిల్లా కోరుట్ల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ట్రాక్టర్లలో తహసీల్దార్ కార్యాలయానికి 600 మంది ఉపాధి హామీ కూలీలు తరలివచ్చారు. ఉపాధి పనులను చుట్టుపక్కల రైతులు అడ్డుకుంటున్నారని నిరసన తెలిపారు. ఐలాపూర్ మేజర్ గ్రామంలో చెరువులలో ఉపాధి పనులకు కూలీలు వెళ్తున్నారు. అయితే వారిని ఉపాధి కూలీలను చుట్టుపక్కన రైతులు అడ్డుకుంటున్నారు. వారం రోజులుగా ఉపాధి పనులు నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పని కల్పించాలని తహసీల్దార్‌కు ఉపాధి కూలీలు విన్నవించుకున్నారు. సోమవారం చెరువులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కిషన్ తెలిపారు.


Similar News