'రైతులు పంట మార్పిడి సూచనలు పాటించాలి'

రైతులు పంట మార్పిడి సూచనలు తప్పక పాటించాలని శాస్త్రవేత్తలు నీలం వెంకటేశ్వరరావు, ఎల్ మహేష్ రైతులకు సూచించారు.

Update: 2023-01-20 07:34 GMT
రైతులు పంట మార్పిడి సూచనలు పాటించాలి
  • whatsapp icon

దిశ ,శంకరపట్నం: రైతులు కాలానుగుణంగా పంట మార్పిడి చేసి వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తప్పక పాటించాలని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు నీలం వెంకటేశ్వరరావు, ఎల్ మహేష్ రైతులకు సూచించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్టుపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు పొద్దుటూరు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మండలములోని కొత్తగట్టు మొలంగూర్ ఆముదాలపల్లి మెట్టుపల్లి లింగాపూర్ గ్రామాల్లో వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులు, కాలానికి అనుగుణంగా లేకపోవడంతో వరి పంటలపై ముగిపురుగు ఇతర కీటకాలు ఎక్కువగా ఆశిస్తున్నాయని తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడంతో వరి పంటలకు తీవ్ర నష్టం జరుగుతున్నట్లు వెల్లడించారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించి పంటలు సాగు చేసి అధికారుల సూచనల మేరకు క్రిమీ కీటకాల నివారణ కోసం పురుగుల మందులను వాడి అధిక దిగుబడులు పొందాలని సూచించారు.

వరి పంటలపై జింక్ లోపంతో ఎక్కువ క్రిమీ కీటకాలు సోకుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి సంఘం అధ్యక్షులు సంజీవరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, మండల ఏవో రాచకొండ శ్రీనివాస్, హెల్త్ కేర్ అగ్రికల్చర్ డివిజనల్ రాష్ట్ర మేనేజర్ వెంకన్న పటేల్, సహకార సంఘం సీఈఓ శనిగరపు సదయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News