'రైతులు యాచించే స్థితిలో కాదు.. శాసించే స్థాయిలో ఉండాలి'

దేశంలో కార్పొరేట్ సర్కార్ వద్దు.. కిసాన్ సర్కార్ రావాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు.

Update: 2022-12-19 15:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో కార్పొరేట్ సర్కార్ వద్దు.. కిసాన్ సర్కార్ రావాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. రైతు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని పేర్కొన్నారు. వ్యవసాయరంగ పథకాల్లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉన్నదని కితాబిచ్చారు. కర్ణాటకలో రాష్ట్రం గదగ్ జిల్లా ముందర్గి స్టేడియంలో కిసాన్ జాగృతి వికాస్ సంఘ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాష్ట్రం తరపున ఆయన పాల్గొని మాట్లాడారు. అన్నం పెట్టే రైతు అప్పులపాలు కాకూడదని, రైతు యాచించే స్థితిలో కాదు శాసించే స్థాయిలో ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, 24 గంటల ఉచిత కరెంట్‌తో తెలంగాణ రైతులలో ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ది లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం నిర్మించడంతో తెలంగాణ సస్యశామలంగా మారిందన్నారు. వ్యవసాయరంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న చేయూత దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. తెలంగాణలో వివాహాలు జరిగితే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకంతో లక్షా నూట పదహారు రుపాయలు అందజేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో రైతు సర్కార్ పాలన ఎలా నడుస్తోందో దేశంలో కుడా కిసాన్ సర్కార్ పాలన ఎంతో అవసరమన్నారు. కార్పొరేట్ అధినేతలు ఆదాని, అంబానీ పాలన వద్దు, కిసాన్ సర్కార్ పాలన కావాలన్నారు. అంతకు ముందు రైతు సంఘం నాయకులు మఠాధిపతులతో కలిసి కలిసి గోపూజ, నాగలి పూజ ధనరాశి పూజజ, కిసాన్ జాగృతి వికాస్ సంఘం ఆధ్వర్యంలో 75 జంటల సామూహిక వివాహాలు చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, జాతీయ రైతు సంఘం అధ్యక్షుడు యుగంధర్ నాయుడు, తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి గోవింద్ రావు, కర్ణాటక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:    

Similar News