అభిమానుల అత్యుత్సాహం.. హీరో ఎన్టీఆర్ క‌టౌట్ ద‌గ్ధం

Update: 2024-09-27 06:37 GMT

దిశ, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా థియేటర్ల వద్ద్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అదుపు తప్పుతుంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుద‌ర్శన్ థియేట‌ర్‌లో అభిమానుల అత్యుత్సాహం థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ కటౌట్ దగ్ధానికి దారితీసింది. అభిమానులు టపాకాయలు కాల్చుతుండగా చెల‌రేగిన నిప్పురవ్వలు కటౌట్ మీద పడడంతో క‌టౌట్‌ పూర్తిగా దగ్ధమైంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో అవి ఎక్కడ చుట్టుపక్కలకు విస్తరిస్తాయోనన్న ఆందోళన వ్యక్తమైంది. థియేటర్ యాజమాన్యం వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు.

తెలుగు రాష్ట్రాలలో దేవర సినిమా థియేటర్ల వద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానుల రచ్చ మరింత అధికమైంది. పోలీసులు పలు థియేటర్ల వద్ధ లాఠీలకు పనిచెబుతూ అభిమానులను అదుపు చేస్తున్న ఘటనలు కొనసాగుతున్నాయి.


Similar News