Stalin And Bjp: ఉదయనిధి స్టాలిన్ కు డిప్యూటీ సీఎం పదవి ఓ క్లాసిక్ ఎగ్జామ్ పుల్: రామచందర్ రావు

స్టాలిన్ కు డిప్యూటీ సీఎం పోస్టుపై బీజేపీ నేత రామచందర్ రావు విమర్శలు గుప్పించారు.

Update: 2024-09-29 06:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఇండియా కూటమి పార్టీలకు దేశ ప్రయోజనాల కంటే తమ కుటుంబ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యం అని తెలంగాణ బీజేపీ సీనియర్ నేత రామచందర్ రావు విమర్శించారు. ఇవాళ తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన రామచందర్ రావు.. రాజకీయాల్లో ఉదయనిధి స్టాలిన్ చట్టబద్ద వారసుడని విమర్శించారు. డీఎంకే ప్రజల సంక్షేమాన్ని కాకుండా తమ కుటుంబ సంక్షేమాన్ని చూసుకుంటోందని ధ్వజమెత్తారు. ఇండియా కూటమిలో కుటుంబ పాలన సాగుతుందని చెప్పడానికి ఉదయనిధి డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించడం ఓ క్లాసిక్ ఉదాహరణ అన్నారు. అలాగే ఈ కూటమిలోని పార్టీలు కుటుంబ ఆధారిత, అవినీతి ,స్వార్థపూరిత పార్టీలని విమర్శించారు. 


Similar News