మాజీ మంత్రి ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పీఎస్‌లో కంప్లైంట్

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ నుంచి ఫైల్స్, కంప్యూటర్లు, ఇతర వస్తు సామాగ్రిని తరలిస్తుండగా ఓయూ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు.

Update: 2023-12-06 08:18 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ నుంచి ఫైల్స్, కంప్యూటర్లు, ఇతర వస్తు సామాగ్రిని తరలిస్తుండగా ఓయూ విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు. రవీంద్ర భారతిలోని శ్రీనివాస్ గౌడ్ కార్యాలయానికి బుధవారం ఉదయం వచ్చిన కొందరు ఓ వాహనంలో ఫర్నిచర్, ఫైల్స్, కంప్యూటర్లను తీసుకెళ్లటానికి యత్నించారు. విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్న విద్యార్థి నాయకులు వారిని అడ్డుకున్నారు. ప్రభుత్వానికి చెందిన సామాగ్రిని ఎలా తరలిస్తారంటూ నిలదీశారు. దీనిపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


Similar News