EVM: పోలింగ్ కేంద్రంలో వినూత్న ఘటన.. ఓటేసేందుకు వచ్చి ఈవీఎంలో కారు గుర్తును చెరిపేసిన ఆకతాయిలు
రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడో ఒకచోట ఆందోళనలు మినహా పోలింగ్ సజావుగా సాగింది. ఈ క్రమంలోనే గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల పరిధిలో ఆకతాయిలు హల్‌చల్ సృష్టించారు. పైపాడు గ్రామంలోని పోలింగ్ బూత్ నెం.167లో ఓటేసేందుకు వచ్చిన కొందరు గుర్తు తెలియని దుండగులు ఈవీఎంపై ఉన్న కారు గుర్తును ఇంకుతో చెరిపేశారు. అయితే, ఓటేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి విషయాన్ని బూత్ బయట ఉన్న బీఆర్ఎస్ నాయకులకు తెలిపారు. వెంటనే వారంతా పోలింగ్ కేంద్రంలోకి వచ్చి సిబ్బందిని మీరేం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వెంటనే ఈవీఎంపై ఉన్న ఇంకును తుడిచివేయాలని వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. కాగా, ఆ పోలింగ్ బూత్‌లో మొత్తం 1,196 ఓట్లు ఉండగా.. 848 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.