Etela Rajender: కేసీఆర్​ది నీతిమాలిన చర్య.. ఈటల రాజేందర్ విమర్శలు

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్​ది నీతిమాలిన చర్య హుజురాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. ట్యాంక్ బండ్​ వద్ద

Update: 2022-04-14 09:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్​ది నీతిమాలిన చర్య అని హుజురాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. ట్యాంక్ బండ్​ వద్ద ఉన్న అంబేద్కర్​ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేసుకునే అవకాశాన్ని అంబేద్కర్ కల్పించారని, కానీ కేసీఆర్​9 శాతం ఉన్న గిరిజనులకు రిజర్వేషన్లు పెంచకుండా అన్యాయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు పెంచకుండా గిరిజనుల కండ్లల్లో కేసీఆర్​మట్టి కొడుతున్నాడన్నారు. సమస్యలు పరిష్కరించడం చేతకాని సీఎం రాజ్యాంగం మార్చాలని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శలు చేశారు. కేసీఆర్ కు రాజ్యాంగంపై గౌరవం కూడా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దళిత జాతిని ముఖ్యమంత్రి అవమానిస్తున్నాడని మండిపడ్డారు. ఏడున్నరేండ్లలో అంబేద్కర్, జగ్జీవన్​రామ్​చిత్రపటాలకు ఏనాడు దండ వేయని వ్యక్తి కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు

Tags:    

Similar News