Errabelli Dayakar Rao: మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి.. మాజీ మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు
రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆరే (KCR) రాబోతున్నాని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆరే (KCR) రాబోతున్నాని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. దీక్షా దివస్ (Diksha Divas) సందర్భంగా ఆయన వరంగల్ (Warangal)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే దేశంలో ఒకేసారి జమిలి ఎన్నికలు (Jamili Elections) రాబోతున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి డిపాజిట్లు కూడా దక్కే పరస్థితి ఉండదని జోస్యం చెప్పారు.
రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆరే (KCR) రాబుతున్నారని కామెంట్ చేశారు. ఈ విషయంలో బీఆర్ఎస్ (BRS) శ్రేణులు ఎవరూ అధైర్య పడొద్దని ఆయన ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు (Government Schools), వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ (Food Poison) ఘటనలు చోటుచేసుకుంటున్నా సర్కార్లో ఏమాత్రం చలనం లేదని ఆరోపించారు. పాలనను గాలికొదిలి సీఎం (CM)తో సహా ఆ పార్టీ నేతలంతా ఢిల్లీ (Delhi) టూర్లు వేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సరైన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.