MLC కవితపై మరోసారి ఈడీ సంచలన ఆరోపణలు
ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారం కేసులో కవిత పాత్రపై ఈడీ కీలక అభియోగాలను మోపింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారం కేసులో కవిత పాత్రపై ఈడీ కీలక అభియోగాలను మోపింది. నిన్న అరెస్ట్ చేసిన మనీశ్ సిసోడియాను ఇవాళ ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా లిక్కర్ పాలసీ తయారీలో మనీష్ సిసోడియా కీలక పాత్ర అని మరింత విచారించాల్సిన అవసరం ఉన్నందున పది రోజుల కస్టడీకి ఇవ్వాలనీ ఈడీ కోర్టును కోరింది. ఈ సందర్భంగా సిసోడియా తరపున దయన్ కృష్ణన్, సిద్ధార్థ్ అగర్వాల్ ఈడీ తరపున ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హొస్సేన్ వాదనలు వినిపించారు. ఈడీ వాదనలు వినిపిస్తూ విజయ్ నాయర్, సిసోడియా, కవితతో పాటు పలువురు ఈ కుట్ర పన్నారని. సౌత్ గ్రూప్ ఆప్ నేతలకు దాదాపు రూ.100 కోట్ల ఇచ్చిందని ఆరోపించారు.
ఢిల్లీలో మొత్తం 30% మద్యం వ్యాపారాన్ని సౌత్ గ్రూప్‌కే దక్కిందని పేర్కొన్నారు. కవితను విజయ్ నాయర్ ను కలిసి పాలసీ ఎలా ఉందో చాపాలని అడిగారు. ఇందులో కేజ్రీవాల్, సిసోడియా తరపున విజయ్ నాయర్ వ్యవహారం నడిపించారని ఈడీ పేర్కొంది. పాలసీ విధానాలకు జీఓఎం నివేదిక మంత్రుల కన్న రెండు రోజుల ముందే బుచ్చిబాబు కవితకు అందజేశారు. ఇండో స్పిరిట్స్ కంపెనీకి ఎల్1 లైసెన్స్‌ని ఇప్పించడంలో సిసోడియా పాత్ర ఉందని ఈ కంపెనీకి జెట్ స్పీడుతో దరఖాస్తు క్లియర్ అయిందని ఆరోపించింది. కొన్ని ప్రైవేట్ కంపెనీలకు హోల్‌సేల్ వ్యాపారం చేయాలనే కుట్రలో భాగంగానే ఈ విధానాన్ని అమలు చేశారని ఆరోపించింది. పాలసీ తయారు చేశాక కొంత మంది ప్రైవేటు వ్యక్తులకు పంపించారని, మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలు ఎలా బయటకు వచ్చాయని ఈడీ ప్రశ్నించింది. మొత్తం ఈ కుట్రను సమన్వయం చేసే బాధ్యత విజయ్ నాయర్ దని ఈ స్కామ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యవర్తులు, రాజకీయ నాయకులు సంబంధించిన అనేక శాఖలు ఉన్నాయని ఈడీ పేర్కొంది.
కవిత దీక్షకు మద్దతు తెలిపిన ఎంపీపై ఆరోపణలు:
ఇదిలా ఉంటే ఇవాళ కోర్టులో ఈడీ వాదనలో అనూహ్యంగా మరో వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. ఢిల్లీలో కవిత దీక్షకు సంఘీభావం తెలిపిన సంజయ్ సింగ్ (ఆప్ ఎంపీ) పేరు ప్రస్తావనకు వచ్చింది. సంజయ్ సింగ్ దినేష్ అరోరాకు ఫోన్ చేసి పార్టీ ఫండ్ గురించి మాట్లాడారని ఈడీ కోర్టులో వాదించింది. సిసోడియా ఏడాది వ్యవధిలో 14 ఫోన్లు ధ్వంసం చేశాడని వీటిలో కేవలం 2 మాత్రమే రికవరీ అయ్యాయి. అసలు తన పేరు మీద లేని సిమ్ కార్డులను ఉపయోగించారని ఆరోపించింది.
Read more: