ECIL Notification: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
నిరుద్యోగులకు హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ (ECIL) సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ (ECIL) సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు సంస్థలోని ఖాళీల భర్తీ చేసేందుకు జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌తో పాటు పలు జోనల్ కార్యాలయాలు, ప్రాజెక్టు సైట్లలో పనిచేసేందుకు గాను 30 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులకు అర్హులైన వారి దరఖాసతు చేసుకోవాలని సూచించింది. అందులో ఈసీఈ విభాగంలో-, ఈఈఈ బ్రాండ్-7, మెకానికల్ విభాగంలో -13, సీఎస్ఈ బ్రాంచ్‌లో 5 చొప్పున ఉద్యోగులకు ఖాళీలు ఉన్నాయి.
మార్చి 23నుంచి ఏప్రిల్ 13 మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని నోటిఫికేషన్ తెలిపారు. పైన పేర్కొన్న ఆయన విభాగాల పోస్టులకు గాను అభ్యర్థులు ఫస్ట్ క్లాస్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ అభ్యర్థులు/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.వేయ్యి చెల్లించాలి. 2024 ఏప్రిల్ 13 నాటికి అభ్యర్థుల వయస్సు 27 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ల ఆధారంగా ఆయా వర్గాలకు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ఉంటుంది. ఆబ్జెక్టివ్ రూపంలో రాత పరీక్ష ఉంటుంది. తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్ మార్కులు ఉంటాయి. హాల్ టిక్కెట్లు, పరీక్ష తేదీలకు సంబంధించిన వివరాలను ఆ తర్వాత వెబ్సైట్లో పొందుపరుస్తారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి,నాగ్‌పుర్, ఢిల్లీ, నోయిడా, కోల్‌కతా వేదిక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉద్యోగానికి ఎంపికైన వారు నాలుగేళ్ల పాటు కంపెనీలో పని చేస్తామని ఒప్పంద పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. వేతనం నెలకు రూ.40,000 – రూ.1,40,000 వరకు వేతనం ఇవ్వబడుతుంది.