భద్రాద్రి రామ భక్తులకు ఈసీ షాక్.. ఎల్లుండి కల్యాణం లైవ్ టెలికాస్ట్ పై ఆంక్షలు

భద్రాచలం శ్రీరామచంద్రుడి భక్తులకు ఈసీ షాక్ ఇచ్చింది.

Update: 2024-04-15 10:55 GMT
భద్రాద్రి రామ భక్తులకు ఈసీ షాక్.. ఎల్లుండి కల్యాణం లైవ్ టెలికాస్ట్ పై ఆంక్షలు
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: భద్రాచలం శ్రీరామచంద్రుడి భక్తులకు ఈసీ షాక్ ఇచ్చింది. ఎల్లుండి జరగబోయే శ్రీ సీతారాముల కల్యాణ వేడుక ప్రత్యక్ష ప్రసారంపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వం అధికారికంగా లైవ్ టెలికాస్ట్ చేయవద్దని ఈసీ నిబంధన విధించింది. దీంతో ప్రసారానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఈఓకి లేఖ రాశారు. శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం గత 40 ఏళ్లుగా ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని అందువల్ల ఈ కార్యక్రమానికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని లేఖలో కోరారు. ఈ మేరకు ఆలయ విశిష్టత, సంప్రదాయాలు వివరిస్తూ ఈసీకి మంత్రి లేఖ రాశారు.

Tags:    

Similar News