బ్రేకింగ్ న్యూస్.. టీఆర్ఎస్ పార్టీకి గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయించిన ఈసీ

తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు కీలక నేతలు, తెలంగాణ ఉద్యమ కారులు కలిసి తెలంగాణ రాజ్య సమితి పార్టీని రిజిస్టర్ చేసుకున్నారు.

Update: 2023-10-19 05:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు కీలక నేతలు, తెలంగాణ ఉద్యమ కారులు కలిసి తెలంగాణ రాజ్య సమితి పార్టీని రిజిస్టర్ చేసుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని.. తమ TRS పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఙప్తి చేసింది. వారి విజ్ఞప్తిని పరిశీలించిన ఎన్నికల సంఘం TRS పార్టీకి గ్యాస్‌ సిలిండర్‌ గుర్తును కేటాయిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పార్టీ తరఫున బరిలో ఉండే అభ్యర్థులందరికీ గ్యాస్‌ సిలిండర్‌ గుర్తునే కేటాయించాలని ఆదేశించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం కనీసం 5% సీట్లలో సదరు పార్టీ పోటీ చేయాల్సి ఉంది. లేదంటే.. సదరు పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఆ గుర్తును ఇతరులకు కేటాయించవచ్చని కూడా స్పష్టంగా పేర్కొంది. కాగా గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. జాతీయ రాజకీయాల్లో బాగంగా బీఆర్ఎస్ పార్టీగా మారింది. ఆ తర్వాత పలు ఉద్యమకారులు తెలంగాణ రాజ్య సమితి పార్టీని ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News