Eatala: అంబేద్కర్ రాజ్యాంగం మార్చే సత్తా ఎవరికీ లేదు.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మార్చే శక్తి, సత్తా ఎవరికీ లేదని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-04-14 09:21 GMT
Eatala: అంబేద్కర్ రాజ్యాంగం మార్చే సత్తా ఎవరికీ లేదు.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: బాబా సాహెబ్ అంబేద్కర్ (Ambedkar) రాసిన రాజ్యాంగం మార్చే శక్తి, సత్తా ఎవరికీ లేదని బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై అబద్ధపు ప్రచారాలతో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. సోమవారం కీసరలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని ఏ పార్టీలు అధికారంలో ఉన్న తూ.చ తప్పకుండా పాటించాలని తెలిపారు. కానీ (Congress) కాంగ్రెస్ పార్టీ మాత్రం అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించిందని ఆరోపించారు. ఆయనకు భారతరత్నను కాంగ్రెస్ తిరస్కరిస్తే వీపీ సింగ్ ప్రభుత్వం ఇచ్చిందని స్పష్టం చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి దేశమంతా జరుపుకుంటుందని, ఇంత గొప్పగా దేశంలో ఎవరి జయంతి జరగదని కొనియాడారు.

ప్రపంచంలో ఇన్ని విగ్రహాలున్న నాయకుడు కూడా ఆయననే అని చెప్పారు. అంబేద్కర్‌ని కేవలం దళితులకు రిజర్వేషన్లు కల్పించిన నాయకుడని చిన్నగా చూపే ప్రయత్నం తప్పన్నారు. ఆయన ఈ దేశానికి ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలో చెప్పారు. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ వ్యవస్థలు ఇచ్చారు. 75 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థగా మనం ఉన్నామంటే దానికి కారణం అంబేద్కరేనని వివరించారు. మన పక్కన ఉన్న పాకిస్తాన్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది చూస్తున్నాం.. 140 కోట్ల జనాభా.. వివిధ కులాలు, వైవిధ్యాలు, అంతరాలు, భాషలు, సంస్కృతులు ఉన్నా మనం చల్లగా ఉండడమే కాకుండా, ప్రపంచానికి ఆదర్శంగా ఉండడానికి పునాదులు వేసిన మహనీయుడు ఈటల తెలిపారు. ఆయన కేవలం హక్కుల గురించి మాత్రమే కాదు.. ఆయన బ్రతుకులను స్పృశించారని అన్నారు.

దేశ సంపద అందరి ఆకలి తీర్చాలని చెప్పారని, అయినా 77 ఏళ్లు అయిన పేదరికం పూర్తిగా పోలేదని, గొప్ప సామ్యవాదం రాలేదని, కులం, మతాలు పోలేదన్నారు. జయంతి అంటే దండలు వేయడం కాదని, ఆయన ఆలోచనలు అర్థం చేసుకొని, ఆ మహనీయుడు స్ఫూర్తిని కొనసాగిద్దామన్నారు. 1990లో వీపీ సింగ్ ఆధ్వర్యంలో ఆయనకు భారతరత్న ఇస్తే, ప్రధాని మోడీ పార్లమెంట్‌లో చిత్రపటం పెట్టించారని, ఢిల్లీతో పాటు అంబేద్కర్ ఉన్న ఐదు ప్రాంతాలను పంచతీర్ధ పేరుతో అభివృద్ధి చేశారని వెల్లడించారు.

Tags:    

Similar News