TS EAPCET Alert: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. తెలంగాణ EAPCET దరఖాస్తుకు గడువు ఇక ఒక్కరోజే
రాష్ట్రంలో తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు గాను నిర్వహించే TS EAPCET-2024 ఎంట్రెన్స్ పరీక్షకు భారీగా దరఖాస్తులు వచ్చాయి.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు గాను నిర్వహించే TS EAPCET-2024 ఎంట్రెన్స్ పరీక్షకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఫిబ్రవరి 26న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 6తో ముగియనుంది. లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకొనేందుకు విద్యార్థులకు ఇంకా ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలను జేఎన్టీయూ-హెచ్ బుధవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఇంజినీరింగ్ విభాగంలో 2,33,517 మంది, అగ్రికల్చర్/ఫార్మా విభాగాల్లో 87,819 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం TS EAPCETకు 3,21,604 దరఖాస్తులు వచ్చాయని జేఎన్టీయూ-హెచ్ వెల్లడించింది.
కాగా, ఇప్పటి వరకు దరఖాస్తు గడువు తేదీ ముగియకముందే గతేడాది కంటే ఈసారి అత్యధికంగా దరఖాస్తులు అందాయి. TS EAPCET రాయాలనుకునే వారు ఏప్రిల్ 6లోగా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని జేఎన్టీయూ-హెచ్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈఏపీ సెట్ పరీక్షలు రాష్ట్రంలో మే 7 నుంచి 11 వరకు జరగనున్నాయి. మే 7,8 తేదీల్లో అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలు, మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలను జరుగనున్నాయి.
TS EAPCET దరఖాస్తు సమర్పించేందుకు ఇక్క క్లిక్ చేయండి: https://eapcet.tsche.ac.in/