E-KYC: రేషన్‌కార్డుదారులు.. బీ అలర్ట్! ఈ-కేవైసీకి ఇక మూడు రోజులే గడువు
రేషన్ కార్డులతో ఈ-కేవైసీ ప్రక్రియ ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: రేషన్ కార్డులతో ఈ-కేవైసీ ప్రక్రియ ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది. అయితే, అందుకు గడువు ఇక మూడు రోజులు మాత్రమే ఉంది. ఇటీవల జనవరి 31లోగా ఈ-కేవైసీని పూర్తి చేయాల్సి ఉండగా ఫిబ్రవరి చివరి వరకు గడువును పొడిగించిన సంగతి అందరికీ విధితమే. ఇప్పటి వరకు ఎవరైనా ఈ-కేవైసీ అప్‌డేట్ చేయించుకోని వాళ్లు వెంటనే చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు మరోసారి ప్రభుత్వం గడువు పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 75.76 శాతం మంది రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నారు. మరో 25 శాతం మంది పెండింగ్‌లో ఉందని, వారంతా సాధ్యం అయినంత త్వరగా ఈ-కేవైసీ చేయించుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. రేషన్ కార్డుదారులు రాష్ట్రంలో ఏ రేషన్ షాపుకు వెళ్లినా.. ఈ-కేవైసీని పూర్తి చేసుకునేందుకు అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం విశేషం.