టాక్సీ డ్రైవర్ల వినూత్న ఆహ్వానం.. 28న జరిగే డ్రైవర్ల ఆవేదన సభకు రావాలని వారందరికి పిలుపు
తెలంగాణలో గత 8 సంవత్సరాలలో టాక్సీ డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం, అధికారుల ముందు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా, మొరపెట్టుకున్నా, ధర్నాలు, సమ్మెలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయడం లేదని
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో గత 8 సంవత్సరాలలో టాక్సీ డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం, అధికారుల ముందు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా, మొరపెట్టుకున్నా, ధర్నాలు, సమ్మెలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయడం లేదని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 28న డ్రైవర్ల ఆవేదన సభను నిర్వహించనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఈ సభకు క్యాబ్ డ్రైవర్లు పెద్ద ఎత్తున తరలి రావాలని పేర్కొంది. రాబోయే ఎలక్షన్స్ తమకు ఆయుధం కావాలని, లేదంటే మరో ఐదు సంవత్సరాలు బానిస బతుకులు బతకాల్సిందే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక, ఈ సభకు ప్రతిపక్షనాయకులను ఆహ్వానించింది. వారితో పాటు మేధావులు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సమాజసేవకులు, పాలకులు వచ్చి మా గోడు విని మాకు న్యాయం చేయండి అని, న్యాయం కోసం తలపెట్టిన సభ అని ట్వీట్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్లంతా సభకు వచ్చి విజయవంతం చేయాలని సంఘం పిలుపునిచ్చింది. ట్వీట్‌కు సీఎం కేసీఆర్, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఫొటోలను జత చేస్తూ వాటిపై మా గోడు వినండి.. మాకు న్యాయం చేయండి అంటూ పోస్టర్లు వేసి ఆహ్వానం పలికింది. దీంతో, ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డిసెంబర్ 28న క్యాబ్ డ్రైవర్ల ఆవేదన సభ. ఈ సభకు మేదావులను,రాజకీయ నాయకులను,పత్రికా పాత్రికేలను, సమాజసేవకులను, మేదావులను, పాలకులను, ప్రతిపక్షాలను వచ్చి మా గోడు విని మాకు న్యాయం చేయండి అని, న్యాయం కోసం చేశే సభ.@TelanganaCMO @revanth_anumula @bandisanjay_bjp @realyssharmila pic.twitter.com/ufkrOfMXCz
— Telangana Gig and Platform Workers Union (@TGPWU) December 27, 2022
Also Read...
అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు KCR కొత్త డ్రామాలు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి