అర్ధరాత్రి మందుబాబుల వీరంగం! ప్రతీ డివిజన్‌లో ఇలానే.. హైదరాబాద్ సీపీకి విజ్ఞప్తి

గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని కుత్బుల్లాపూర్‌‌లో అర్ధరాత్రి (Drinkers) మందుబాబులు వీరంగం సృష్టించారు.

Update: 2025-04-05 08:43 GMT
అర్ధరాత్రి మందుబాబుల వీరంగం! ప్రతీ డివిజన్‌లో ఇలానే.. హైదరాబాద్ సీపీకి విజ్ఞప్తి
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని కుత్బుల్లాపూర్‌‌లో అర్ధరాత్రి (Drinkers) మందుబాబులు వీరంగం సృష్టించారు. (Jagadgiri gutta Police Station)జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి వెంకటేశ్వర నగర్ బాపూజీ హై స్కూల్ పక్క వీధిలో అర్ధరాత్రి మందు బాబులు నానా హంగామా క్రియేట్ చేశారు. కొందరు యువకులు రాత్రిపూట మందు తాగుతూ కాలనీ వాసులకు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన కాలనీవాసులపై రెచ్చిపోతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫూటేజీ వీడియోలు తాాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో తరుచుగా ఇలాంటివి ఘటనలు జరుగుతున్నాయని నెటిజన్లు వాపోతున్నారు. ప్రతీ డివిజన్‌లో ఇదే తంతు అని, ఇలాంటివి కంట్రోల్ చేయాలని హైదరాబాద్ సీపీ సీవి ఆనంద్‌కు ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా నగరంలో మళ్లి కార్టన్ సెర్చ్‌లు మొదలు పెట్టాలని ఓ నెటిజన్ కోరారు.

Tags:    

Similar News