CM Revanth Reddy: రెండు రోజుల్లో కుల గణన ముసాయిదా.. అధికారులకు సీఎం అభినందనలు

కులగణన విషయంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-01-29 09:38 GMT
CM Revanth Reddy: రెండు రోజుల్లో కుల గణన ముసాయిదా.. అధికారులకు సీఎం అభినందనలు
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుల గణనపై మూఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని అన్నారు. రాష్ట్రంలో పూర్తి చేసిన కుల గణన (Caste Census) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయన్నారు. సర్వే విజయవంతంగా చేపట్టిన అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. కాగా సర్వేకు సంబంధించిన ముసాయిదా (Draft) సిద్దమయిందని.. ఒకటి రెండు రోజుల్లో సమర్పిస్తామని అధికారులు వివరించారు. పూర్తి నివేదికను ఫిబ్రవరి 2వ తేదీ లోగా కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తామని సీఎంకు వివరించారు.

Tags:    

Similar News