ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉందాం: ప్రజలకు మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి

కొవిడ్ వాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దని, అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్, ప్రికాషన్ డోసు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Update: 2023-03-17 09:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కొవిడ్ వాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దని, అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్, ప్రికాషన్ డోసు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలలో వాక్సిన్ అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి అధికారులకు అదేశాలు ఇచ్చారు. అంతేగాక రాష్ట్రానికి మరిన్ని డోసులు సరఫరా చేయాలని కోరుతూ ఆయన కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు పెరుగుదలపై కేంద్రం గురువారం అలెర్ట్ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డి హెచ్ శ్రీనివాస్ రావు, డీ ఎం ఇ రమేష్ రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు ఇతర వైద్య విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News