రేవంత్ రెడ్డికి టాలీవుడ్ స్టార్స్‌లో ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?

తెలంగాణలో పదేళ్ల తర్వాత అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకువచ్చారు రేవంత్ రెడ్డి.

Update: 2023-12-06 06:13 GMT
రేవంత్ రెడ్డికి టాలీవుడ్ స్టార్స్‌లో ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పదేళ్ల తర్వాత అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకువచ్చారు రేవంత్ రెడ్డి. దీంతో రాష్ట్రాన్ని నడిపే బాధ్యత కూడా ఆయన మీదే పెట్టారు. సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు.. ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు, రాజకీయంగా చిత్తు చేసే వ్యూహాలతో బిజీగా ఉన్నారు.

రేవంత్ రెడ్డి.. తెలంగాణకు రెండో సీఎం... మొట్ట మొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే యంగ్ అండ్ డైనమిక్ లీడర్. అయితే తాజాగా, వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. సీఎం రేవంత్ రెడ్డికి ఓ టాలీవుడ్ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమట. ఆయన ఎవరో కాదు మహేష్ బాబు తండ్రి దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఈ విషయాన్ని గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పేరు మార్మోగుతుంది. ఎక్కడ చూసినా ఆయనకు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతున్నాయి.


Similar News