ఫోన్ ట్యాపింగ్ వల్లే ఆ హీరోయిన్ కు విడాకులు?.. సంచలనం రేపుతున్న ప్రణీత్ రావు టీమ్ బాగోతాలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో పూట పూటకు కొత్త మలుపులు తిరుగుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో:ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో పూట పూటకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబీ లో పని చేసిన ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్ చేసి విచారించగా విస్తుపోయే విషయాలు వెల్లడవుతున్నాయి. ప్రతిపక్షం, స్వపక్షం అనే తేడా లేకుండా వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు ఇలా తాము అనుకున్నవారందరిపై అక్రమంగా నిఘా ఉంచినట్లు విచారణలో వెల్లడవుతున్నది. ఈ క్రమంలో సెలబ్రెటీల విషయంలో ప్రణీత్ రావు టీమ్ చేసిన దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఓ టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేయడంతో ఆమె వ్యవహారం భర్తతో విడాకుల వరకు వెళ్లిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇలా ఇంకెంతమంది హీరో హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయో అని చర్చ కూడా కొనసాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఎక్కువగా ఈ ఇష్యూపైనే సెర్చ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
బాధితులెంతమందో?:
ఫోన్ ట్యాపింగ్ కేసు సిత్రాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండగా ఈ కేసులో బాధితులెంతమంది అనేది ఆలోచిస్తే ఆశ్చర్యం కలిగిస్తోందనే చర్చ జరుగుతోంది. సినీ, రాజకీయ, రియల్టీ, నగల వ్యాపారులను టార్గెట్ చేసుకుని ఈ తతంగాన్ని నడిపించినట్లు తెలుస్తోంది.నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ఎస్ఐబీ ప్రభాకర్ రావుకు టార్గెటెడ్ ఫోన్ నెంబర్లు చేరేవని ఆయన నుంచి ప్రణీత్ రావు టీమ్ కు అందేవని, అట్ల వచ్చిన ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసి అక్రమంగా వారి ఫోన్ సంభాషణలు విని వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. ఎస్ఐబీని అడ్డం పెట్టుకుని నడిపిన ఈ ట్యాపింగ్ బాగోతంలో రాబోయే రోజుల్లో ఎవరెవరి పేర్లు తెరమీదకు రాబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది.