‘వివాదాస్పద స్థల నివేదికలను కలెక్టర్‌కు సమర్పిస్తాం’

వివాదాస్పద స్థల నివేదికలను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని భూములు కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుదర్శన్ అన్నారు.

Update: 2023-04-18 09:15 GMT
‘వివాదాస్పద స్థల నివేదికలను కలెక్టర్‌కు సమర్పిస్తాం’
  • whatsapp icon

దిశ, లోకేశ్వరం: వివాదాస్పద స్థల నివేదికలను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని భూములు కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుదర్శన్ అన్నారు. మంగళవారం లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ అబ్దుల్లాపూర్ పరిసరాల్లోని వివాదాస్పద ప్రాంతాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థల పరిశీలనకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆ స్థలంలో జిపిఎస్ పాయింట్లు సేకరించడం జరిగిందని సిస్టంలో పరిశీలించి ఆ స్థలం ఏ శివారులో ఏ సర్వే నంబర్‌లో ఉందో నివేదికలు తయారు చేసి కలెక్టర్‌తో పాటు గ్రామస్తులకు అందజేస్తామని తెలిపారు. ఇరు వర్గాల వారు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని పక్కా సమాచారాన్ని వీలైనంత త్వరలో అందజేస్తామని ఆయన అన్నారు.

Tags:    

Similar News