High Court : దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసు... రేపు హైకోర్టులో కీలక తీర్పు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళ కేసు(DilsukhNagar Bomb Blats Case)లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది.

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళ కేసు(DilsukhNagar Bomb Blats Case)లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో ఏప్రిల్ 8న హైకోర్ట్(High Court) కీలక తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో ముద్దాయిలు దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం ధర్మాసనం తుది విచారన జరపనుంది. 2013లో దిల్ సుఖ్ నగర్లో పలుచోట్ల జరిగిన ఈ భారీ బాంబు పేలుళ్లలో 18 మంది మూతి చెందగా.. 130 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ బత్కల్(Yasin Bathkal) సహ మరో ఐదుగురికి ఎన్ఐఏ(NIA) ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ 2016లో ఉరిశిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు రేపు తుది తీర్పు వెలువరించనుంది. కాగా ఘటన జరిగిన నాటి నుంచి యాసిన్ బత్కల్ సహ పలువురు నిందితులు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు.