పార్టీ నేతలను చేతులు జోడించి కోరుతున్నా: Digvijaya Singh

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-12-23 05:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై మండిపడ్డారు. 2004లో ఇచ్చిన మాటను 2014లో నెరవేర్చామని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమయంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుంటే తెలంగాణ ఏర్పడి ఉండేది కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలోనే కాంగ్రెస్‌పై కేసీఆర్ దుష్ప్రచారం చేయడం ప్రారంభించారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలను భయపెట్టి టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారని, ఇంతకంటే కృతఘ్నత ఉండదని ఎద్దేవా చేశారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చానని కేసీఆర్ ఎంత చెప్పినా వాస్తవాలు ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ కుటుంబం అవినీతి భారీగా పెరిపోయిందని అన్నారు. అతినీతిలో టీఆర్ఎస్ సర్కార్ రికార్డులు బద్దలు కొడుతోందని సెటైర్ వేశారు. ప్రధాని మోడీ హయాంలో నిరుద్యోగం, ధరలు బాగా పెరిగిపోయాయి, పేద, మధ్య తరగతి ప్రజలు చితికిపోతున్నారని అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో నిర్ధోషులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్జిషీట్లు దాఖలు చేయకుండా, బెయిల్ రాకుండా హింసిస్తున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటోందని, రాహుల్ గాంధీ పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తోందని అన్నారు.

పార్టీ లైన్ దాటొద్దు

సీరియర్, జూనియర్ అనే తేడా లేదని పార్టీ నేతలకు దిగ్విజయ్ సింగ్ సూచించారు. కష్టపడే వారిని పార్టీ కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. ఏవైనా అంతర్గత గొడవలు ఉంటే లోపల చర్చించుకోవాలని సూచించారు. పార్టీ లైన్‌కు నేతలంగా కట్టుబడి ఉంటాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఏ సమస్య అయినా అంతర్గతంగా చర్చించాలని, ప్రెస్‌మీట్లు పెట్టి బహిరంగ ప్రకటనలు చేయొద్దని అన్నారు. ఈ విషయంలో పార్టీ నేతలను చేతులు జోడించి వేడుకుంటున్నా అని అన్నారు. అందరం కలిసిగట్టుగా ఉంటేనే ప్రత్యర్థుల్ని బలంగా తిప్పికొట్టగలం అని అభిప్రాయపడ్డారు. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుంది. కార్యకర్తలు, నేతలంతా మళ్లీ అదే ఉత్సాహంతో పనిచేయాలి. బీఆర్ఎస్‌, బీజేపీపై పోరాటానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం త్వరలో పీసీసీ మార్పు ఉంటుందా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.. ఇన్‌చార్జి మార్పు తన పరిధిలోని అంశం కాదని అన్నారు.

Read More: తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభానికి కారణం ఆయనే!

Tags:    

Similar News