యాదగిరిగుట్టలో ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం కొండపై కొలువైన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు శాస్త్రయుక్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి.
దిశ, వెబ్ డెస్క్ : యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం కొండపై కొలువైన పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు శాస్త్రయుక్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మొదటి రోజు ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్యప్రాసన, అఖండ దీపారాధన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి పూజల్లో పాల్గొనాలనుకునే దంపతులకు రూ.1116, ఒక రోజు సప్తశతి పారాయణంకు రూ.116, లక్ష కుంకుమార్చనకు రూ.116లు చెల్లించాలని ఈవో తెలిపారు.