అసెంబ్లీ, మీడియా పాస్‌లు ఇకపై ఆ రంగులో ఉండవు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కొంత ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కొంత ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే గత పదేళ్లుగా పాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. అసెంబ్లీలో పార్టీ రంగు అయిన ‘గులాబీ కలర్’.. అసెంబ్లీలో దాదాపు ప్రతి పేపర్‌పై ఉండేది. సమావేశాల సమయంలో మీడియాకు ఇచ్చే అసెంబ్లీ పాస్‌ల నుంచి అసెంబ్లీలో సభ్యులకు ఇచ్చే పేపర్ల వరకు గులాబీ రంగులో ఉండేవి. దీంతో గులాబీ రంగును మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలోనే ‘గులాబీ’ రంగును తీసేయండి.. అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. గులాబీ రంగుల్లో ఉన్న పాస్‌లకు వేర్వేరు రంగుల్లో ఇవ్వాలని సూచించారు. అసెంబ్లీలో గులాబీ కలర్‌లో ఉండే అసెంబ్లీ పాస్‌లు, మీడియా పాస్‌లు, కశ్చన్ అవర్ పేపర్‌లు లాంటి అన్నీంటిని ఇతర కలర్లలోకి మార్చాలని ఆదేశాలిచ్చారు.