BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం వెనక అసలు కారణం ఇదే.. సీక్రెట్ రివీల్ చేసిన భట్టి

రాష్ట్రంలో ఎమ్మెల్యేల వలసల ప్రవాహం కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లకే

Update: 2024-07-03 11:48 GMT

 దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎమ్మెల్యేల వలసల ప్రవాహం కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లకే పరిమితం కావడంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. మరికొందరు ఎమ్మెల్యేలు సైతం ఇదే బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్టేట్ పాలిటిక్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల చేరికపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలను భరించలేకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి రమ్మని మేం అడగటం లేదని క్లారిటీ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ అన్యాయాన్ని అరికట్టాలని వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు అంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై ఈ సందర్భంగా భట్టి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పవర్ కట్స్ లేవు.. కేవలం వివిధ కారణాలతో అంతరాయాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణ వ్యవహారం పార్టీ హై కమాండ్ చూసుకుంటుందని తేల్చి చెప్పారు. పీసీసీ ఎంపికపై కూడా తన అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని.. నూతన పీసీసీ చీఫ్ ఎన్నిక త్వరగా పూర్తి చేయాలని సూచించానని తెలిపారు.   

Tags:    

Similar News