హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎవరి నోట విన్న హైడ్రా పేరు వినిపిస్తోంది.

Update: 2024-09-29 08:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎవరి నోట విన్న హైడ్రా పేరు వినిపిస్తోంది. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను రక్షించేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ హైడ్రా ని ఏర్పాటు చేసింది. పూర్తి అధికారాలు హైడ్రాకు ఇవ్వడం తో అక్రమ కట్టడాలపై హైడ్ర ఉక్కుపాదం మోపుతుంది. అయితే రాను రాను హైడ్రా దారితప్పుతుందని, అక్రమాల పేరుతో పేద, మధ్య తరగతి వారి ఇండ్లు కూల్చివేసి వారిని రోడ్డున పడేస్తుందని, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై.. పేదలను ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారని.. ఇప్పటి వరకు FTLలో కట్టుకున్న ఇండ్లను మాత్రమే కూల్చేస్తున్నామని.. బఫర్ జోన్‌లో ఉన్నవాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.


Similar News