ఫోన్ ట్యాపింగ్‌పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో దుమారం రేపుతోంది. తాజాగా ఈ కేసులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేతలను టార్గెట్ చేసి ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడటం దారుణమన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో దుమారం రేపుతోంది. తాజాగా ఈ కేసులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేతలను టార్గెట్ చేసి ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడటం దారుణమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించిందని మండిపడ్డారు. కేవలం రాజకీయ అవసరాల కోసం అధికారులను, డిపార్ట్‌మెంట్లను వాడుకోవడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, జడ్జిల ఫోన్‌లు సైతం ట్యాపింగ్‌కు గురయ్యాయంటే బీఆర్ఎస్ పాలనలో పరిస్థితి ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు అని అన్నారు. ఇంత జరిగినా.. తమకు సంబంధం లేదని బీఆర్ఎస్ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఎవరూ ఆందోళన చెందవద్దని.. ప్రతి పౌరుడి హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని భరోసా ఇచ్చారు.