Recruitments: నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-16 07:52 GMT
Recruitments: నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల (Job recruitment) భర్తీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తెలంగాణ శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ ఖాళీలు అంచనా వేసి టీజీపీఎస్సీ (TGPSC) ద్వారా పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్లు భట్టి వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ మేరకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

ప్రశ్నపత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్ జరగకుండా పారదర్శకంగా పరీక్షల నిర్వహాణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ ప్రకటించామని అన్నారు. దశల వారీగా ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్టు తెలిపారు. గత (BRS) పదేళ్లలో ఒక్క డీఎస్సీ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని, తాము అధికారంలోకి వచ్చాక డీఎస్సీ భర్తీ తో పాటు నియామక పత్రాలు కూడా అందజేశామని వివరించారు.

Tags:    

Similar News