సింగరేణి ఎక్స్‌పాన్షన్‌పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రపంచం మొత్తం థర్మల్ పవర్‌ను ప్రొత్సహించడం లేదని, ఇలాంటి టైంలో సింగరేణి సంస్థను బొగ్గు గనులకే పరిమితం చేస్తే భవిష్యత్తు ఉండదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

Update: 2024-10-07 07:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచం మొత్తం థర్మల్ పవర్‌ను ప్రొత్సహించడం లేదని, ఇలాంటి టైంలో సింగరేణి సంస్థను బొగ్గు గనులకే పరిమితం చేస్తే భవిష్యత్తు ఉండదని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రగతి భవన్‌లో ఈ రోజు (సోమవారం) నిర్వహించిన సింగరేణి కార్మికుల బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సింగరేణిని భవిష్యత్తును సుస్థితరం చేసేందుకు, మునుముందు మరింత లాభాల్లో నడిపించేందకు గానూ ఆల్టర్నేటివ్ పవర్ ప్రాజెక్ట్‌ల వైపు సంస్థను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు.

లక్ష మంది బతికే సింగరేణిని భవిష్యత్ తరాలకు అందించకపోతే వాళ్ల జీవితాలు, భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని, అందుకే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్థను ఎక్స్‌ప్యాండ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు. సింగరేణిని.. లిథియం బ్యాటరీ, గ్రీన్ ఎనర్జీ, సోలార్, హైడ్రోజన్ పవర్‌ ప్రాజెక్ట్‌లకు ఎక్స్‌ప్యాండ్ చేసే ఆలోచలోప్రభుత్వం ఉందని, నిరుపయోగంగా ఉన్న సింగరేణి స్థలాలను అతి త్వరలో భారీ పెట్టుబడిగా మార్చి దాని నుంచే రెవెన్యూ సంపాదించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల తాను విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో కూడా అక్కడి కంపెనీలతో ఈ విషయంపై చర్చించానని, అతి త్వరలో ఆ వైపుగా ప్రభుత్వం అడుగులు వేయబోతోందని స్పష్టం చేశారు. అనంతరం కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ చేశారు.


Similar News