పూర్తయినా పంపిణీలో జాప్యం.. కమలాపూర్‌లో డబుల్ ఇండ్ల ముట్టడికి యత్నం..

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయిన ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేయడం లేదని సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు.

Update: 2022-11-04 07:36 GMT

దిశ,కమలాపూర్: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయిన ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేయడం లేదని సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో స్థానికులు ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించేందుకు ప్రయత్నించారు. ఇళ్లు లేక కూలీ పని చేసుకునే నిరుపేదలు కిరాయిలు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి అయినా ప్రభుత్వం ఇండ్ల పంపిణీలో జాప్యం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇండ్ల పంపిణీ చేయాలని సీపీఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీపీఐ నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 


Similar News