ప్రస్తుతం పోలీసులకు అతిపెద్ద సవాల్‌‌గా సైబర్ క్రైమ్: President Draupadi Murmu

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభబాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 74వ ట్రైనీ ఐపీఎస్ బ్యాచ్‌తో సమావేశమయ్యారు.

Update: 2022-12-27 12:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభబాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 74వ ట్రైనీ ఐపీఎస్ బ్యాచ్‌తో సమావేశమయ్యారు. శిక్షణ పూర్తి చేసుకుంటున్న ట్రైనీ ఐపీఎస్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ.. సర్దార్ వల్లభబాయ్ పటేల్ అందరికి ఆదర్శమని అన్నారు. నూతన ఐపీఎస్‌లు నేరాలను పరిశోధించడమే కాదని.. వాటిని పూర్తిగా అరికట్టే విధంగా ఆలోచన చేయాలని ఆమె సూచించారు. ప్రస్తుతం పోలీసులకు సైబర్ క్రైమ్ అతిపెద్ద సవాల్‌గా మారిందన్నారు. ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా ఉండాలని చెప్పారు. మహిళలకు భద్రత, భరోసా కల్పించాలని కోరారు. 

Tags:    

Similar News