సీఎం భేటీ మరుసటి రోజే గవర్నర్ వద్దకు ఆ ముగ్గురు

గవర్నర్ తో సీఎస్, స్పీకర్, మండలి చైర్మన్ భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-07-02 13:33 GMT
సీఎం భేటీ మరుసటి రోజే గవర్నర్ వద్దకు ఆ ముగ్గురు
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: గవర్నర్ సీ.పీ రాధాకృష్ణన్ తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ భేటీ అయ్యారు. మంగళవారం రాజ్ భవన్ లో వీరు గవర్నర్ ను కలిశారు. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు, మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నదన్న ఊహాగానాల నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ను కలిశారు. ఆ మరుసటి రాధాకృష్ణన్ తో రోజే సీఎస్, స్పీకర్, చైర్మన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. రేపు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. అక్కడ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ కాబోతున్నట్లు సమాచారం. ఈ భేటీలో భాగంగా మంత్రి విస్తరణపై ఫైనల్ నిర్ణయం వెలువడబోతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఎల్లుండి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నది. ఇటువంటి తరుణంలో కీలకమైన పదవుల్లో ఉన్న సీఎస్, స్పీకర్, మండలి చైర్మన్ లు గవర్నర్ ను కలవడంతో మంత్రి వర్గ విస్తరణ అంశంపైనే వీరు గవర్నర్ ను కలిసి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News