CS Shanti Kumari: మహిళలకు మరో భారీ గుడ్ న్యూస్.. ఇందిరా మహిళా శక్తిపై సర్కార్ స్పీడ్

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలుపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష

Update: 2024-11-21 13:13 GMT
CS Shanti Kumari:  మహిళలకు మరో భారీ గుడ్ న్యూస్.. ఇందిరా మహిళా శక్తిపై సర్కార్ స్పీడ్
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగం పెంచింది. తాజాగా గురువారం ఇందిరా మహిళా శక్తి (Indira Mahila Shakti) కార్యక్రమం అమలుపై రాష్ట్ర సచివాలయంలో సీఎస్ శాంతి కుమారి (CS Shanti Kumari) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిల్పారామంలో 106 స్టాళ్లలో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ మేరకు మహిళా శక్తి బజార్ పనులు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మహిళా సంఘాల ఆధ్వర్యంలో తొలి విడతలో 1000 మెగా వాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ ఏర్పాట్లు, మొదటి దశలో 150 బస్సులను కొనుగోలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 22 మహిళా శక్తి భవనాలు సిద్ధం అవుతున్నాయని ఈ సందర్భంగా సీఎస్ వెల్లడించారు.

Tags:    

Similar News