రైళ్లలో నేరాలను నియంత్రించాలి: DGP Anjani Kumar​

రైళ్లలో నేరాల నియంత్రణకు కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్​ఆదేశించారు.

Update: 2023-02-16 15:09 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : రైళ్లలో నేరాల నియంత్రణకు కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్​ ఆదేశించారు. రైళ్లు, రైల్వే ట్రాక్​లపై జరిగే మరణాల సంఖ్యను తగ్గించాలని, మానవ అక్రమ రవాణా, చోరీలను కట్టడి చేయాలని సూచించారు. రాష్ట్ర రైల్వే భద్రతా కమిటీతో గురువారం డీజీపీ అంజనీ కుమార్​తన ఆఫీసులో భేటీ అయ్యారు. ప్రమాదాలు జరిగే బ్లాక్​స్పాట్స్​ను గుర్తించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

రన్నింగ్ ట్రైన్లలో చైన్​స్నాచింగ్‌ల్, ఫోన్ల చోరీలపై షార్ట్​ఫిల్మ్​రూపొందించి ప్రయాణికుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్​కెమెరాల సాయంతో నేరాలను తగ్గించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, కఠినంగా వ్యవహరించాలని స్పష్టంచేశారు. ఆన్​లైన్​ టిక్కెట్ ​బుకింగ్ ​అవకాశంగా చేసుకుని జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయాలని, అవసరమైతే మీడియా సాయం కూడా తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రైల్వే అదనపు డీజీ శివధర్​రెడ్డి, అదనపు డీజీ (శాంతి భద్రతలు) సంజయ్​ కుమార్​ జైన్​తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read...

అక్కడ ఫ్లెక్సీ వార్.. ఆధ్యాత్మిక ఫ్లేక్సీలను చించివేసిన గుర్తు తెలియని వ్యక్తులు..

Tags:    

Similar News