CM రేవంత్‌కు బిగ్ షాక్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సీపీఎం..!
టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సీపీఎం పార్టీ షాక్ ఇచ్చింది. ఇటీవలే సీఎం రేవంత్ సీపీఎం నాయకులతో పార్లమెంట్
దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సీపీఎం పార్టీ షాక్ ఇచ్చింది. ఇటీవలే సీఎం రేవంత్ సీపీఎం నాయకులతో పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఇండియా కూటమిలో బాగస్వామిగా ఉండడంతో బీజేపీ పార్టీని ఓడించడానికి రాష్టంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరడంతో సీపీఎం నేతలు ఆ చర్చల్లో అంగీకరించారు. కానీ ఆ పార్టీ తరపున భువనగిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న జహంగీర్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని పట్టుబట్టారు. ఇందుకు సీఎం అంగీకరించలేదు. తాము పోటీ చేస్తున్న భువనగిరి స్థానానికి పోటీ తగ్గేదేలేదని సంకేతం ఇచ్చింది.
ఈ మేరకు ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం టి.జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి మహమ్మద్ జహంగీర్‌ను బలపర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మతోన్మాద శక్తుల ఓటమి కోసం పార్టీ నిర్వహిస్తున్న రాజకీయ ప్రచారం గురించి సమావేశం సమీక్షించింది. దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు బీజేపీ చేసిన అన్యాయాలను ఎండగట్టే కృషిని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఈ కృషికి తోడ్పడేందుకు, పార్టీ యొక్క స్వతంత్ర రాజకీయ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకుగాను మిగిలిన 16 స్థానాలలో మతోన్మాద బీజేపీని ఓడిరచేందుకు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపర్చాలని ప్రజలను కోరింది.