కిషన్ రెడ్డి, బండి సంజయ్ తక్షణమే ఆ పని చేయాలి.. CPIM సంచలన డిమాండ్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident)పై సీపీఐఎం(CPIM) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident)పై సీపీఐఎం(CPIM) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ పనులను తిరిగి ప్రారంభిస్తున్న సందర్భంలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి మరమ్మతుల అనంతరం పనులు ప్రారంభిస్తే బాగుండేదని తెలిపారు. ఇలాంటి ఘటన పురావృతం కాకుండా చూడాలని.. జరిగిన విషయంపై న్యాయవిచారణ కమిటీని వేయాలని డిమాండ్ చేశారు.
పొట్ట చేత పట్టుకొని బతుకుదెరువు కోసం వచ్చిన కార్మికులు, కార్మికుల కుటుంబ సభ్యులు 8 రోజులుగా ఆ కార్మికుల జాడ తెలియకపోవడంతో మనోవేదనతో ఉన్నారని పేర్కొన్నారు. అయితే అక్కడ పనిచేస్తున్న కార్మికులకు గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఈ విషయంలో కాంట్రాక్టర్, ప్రభుత్వం కార్మికులను గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రం ప్రేక్షక పాత్ర..
ఎస్ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel)లో జరిగిన ఘటనపై కేంద్రం నామమాత్రంగా బలగాలను పంపించి ప్రేక్షక పాత్ర పోషిస్తుందని ఈ విషయంలో మోడీ ప్రభుత్వం(Modi Govt) సహాయ చర్యలు అందించడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులున్నప్పటికీ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోకపోవడం సీపీఐఎం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం నష్టం జరిగిపోయిందని.. ఇది ప్రభుత్వాల వైఫల్యం అని మండిపడ్డారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చడంలో విఫలం కావడంతోపాటు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా గాలికి వదిలేసిన కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay)లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.