విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయాలి.. కూనంనేని
విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు తక్షణమే పీఆర్సీని అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు తక్షణమే పీఆర్సీని అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. పీఆర్సీ ఫిట్మెంట్ ఇవ్వడం ఆలస్యం అవుతుందని, నాలుగు సంవత్సరాలకు 35 శాతం ఫిట్ మేంట్ ఇవ్వాల్సి ఉండగా 6 శాతం మాత్రమే ఇస్తామనడం అన్యాయమని ఒక ప్రకటనలో తెలిపారు. 2018లో పీఆర్సీ ఫిట్ మేంట్ 35 శాతం ఇచ్చారని, గతంలో మాదిరిగా ఈసారి కూడా 35 శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా విద్యుత్ సంస్థలలో 70 వేలకు పైగా ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల 2022 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీని వెనువెంటనే అమలు చేయడం వలన మూడు లక్షల కుటుంబాలకు న్యాయం జరుగుతున్నదని వారు పేర్కొన్నారు.
విద్యుత్ సంస్థల్లో 1999 నుంచి 2004 వరకు ఉద్యోగంలో చేరిన వారికి రాష్ట్రంలో మిగతా ప్రభుత్వ రంగ సంస్థల్లో మాదిరిగా ఈపీఎఫ్ టూ జీపీఎఫ్ నీ అమలు చేయాలన్నారు. దీనివలన రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కం, నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ నాలుగు సంస్థల్లో పనిచేస్తున్న 70 వేల మందికి ఉపయోగం జరుగుతుందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఈ నెల 17న నిర్వహించే సమ్మెలో డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
Also Read..
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యతిరేక కూటమిదే విజయం: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు